కొలంబో: కరోనా ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా అన్ని వ్యాపారాలు కుదేలయ్యాయి. సినిమా థియేటర్లు కూడా మూతపడటంతో యజమానులు తీవ్రంగా నష్టపోయారు. ఈ క్రమంలో అన్ని దేశాలు క్రమంగా లాక్డౌన్ను ఎత్తివేస్తున్నాయి. అయినప్పటికీ చాలా దేశాల్లో సినిమాహాళ్లు, పబ్లిక్ పార్కులు, పబ్లు వంటివి తెరవలేదు. కాగా తాజాగా శ్రీలంకలో సినిమా థియేటర్లను తిరిగి ఓపెన్ చేయనున్నట్టు ఆ దేశం ప్రకటించింది. ఇందుకు ప్రతి థియేటర్ నిర్వాహకులు స్థానిక ఆరోగ్యశాఖ అధికారులకు ఒప్పంద పత్రాన్ని అందజేయాల్సి ఉంటుంది.అలాగే దేశంలో అన్ని మ్యూజియాలను, […]