సామాజిక సారథి, సిద్దిపేట: అన్నదాతలకు బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్పీ) రాష్ట్ర కోఆర్డినేటర్ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అండగా నిలిచారు. వర్షానికి తడిసిన ధాన్యాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఆదివారం సిద్దిపేట జిల్లా కుకునూర్పల్లిలో రైతులతో ఆయన మాట్లాడారు. వానకు తడవగా.. ఎండబెట్టిన ధాన్యాన్ని పరిశీలించారు. అకాలవర్షాలతో ధాన్యం తడిసి పంటకు గిట్టుబాటు ధర రావడం లేదని మహిళా రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు […]