సారథిన్యూస్, హైదరాబాద్: అన్ని రంగాలవారిని కరోనా వణికిస్తున్నది. వైద్యులు, జర్నలిస్టులు, రాజకీయనాయకులు కరోనా బారినపడుతున్నారు. తాజాగా ఓ తెలుగు సీరియల్ నటుడికి కరోనా సోకింది. లాక్డౌన్ సడలింపులతో టీవీ సీరియల్స్ షూటింగ్ ప్రారంభమయిన విషయం తెలిసిందే. ఇటీవలే ఓ టీవీ సీరియల్ దర్శకుడికి కరోనా సోకగా తాజాగా గృహలక్ష్మి సీరియల్ నటుడు హరికృష్ణకు కరోనా సోకింది. దీంతో శుక్రవారం జరగాల్సిన ఈ సీరియల్ షూటింగ్‌ను నిలిపివేశారు. ఇటీవలే కరోనా సోకిన టీవీనటుడు ప్రభాకర్‌తో హరికృష్ణ కాంటాక్ట్ అయ్యాడు. […]
వరంగల్ రూరల్ జిల్లా: రాష్ట్రంలో కరోనా మహమ్మారి కోరలు చాస్తున్నది. జర్నలిస్టులు, వైద్యులు, ప్రభుత్వ అధికారులు ఎవ్వరినీ వదలడం లేదు. తాజాగా వరంగల్ జిల్లాకు చెందిన ప్రముఖ కంటి వైద్య నిపుణుడు డాక్టర్ మెరుగు సుధాకర్ కరోనా బారినపడ్డారు. నర్సంపేట పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో గత ఆదివారం డాక్టర్ సుధాకర్ 70 మంది రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించినట్టు సమాచారం. ఆయన ప్రస్తుతం సూర్యాపేట కరోనా ప్రత్యేకాధికారిగా బాధ్యతలు నిర్వహిస్తుండటం గమనార్హం