సారథి న్యూస్, పెద్దశంకరంపేట: మెదక్ జిల్లా పెద్దశంకరంపేట గవర్నమెంట్ హైస్కూలు తెలుగు ఉపాధ్యాయులు శంకరయ్య రాసిన ‘విమల శతకం’ పుస్తకాన్ని బుధవారం డీఈవో రమేష్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 108 పద్యాలు నైతిక విలువలకు సంబంధించినవే ఉన్నాయని అన్నారు. యువతను చైతన్యపరచడం, కుటుంబక్షేమం.. వంటి అనేక విషయాలను ఇందులో రాయడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో హెచ్ఎం పోమ్యానాయక్, సెక్టోరియల్ ఆఫీసర్ సుభాష్, నాగేశ్వర్ నాయక్, టీచర్లు రఘునాథ్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.