సారథి న్యూస్, జూరాల: జోగుళాంబ గద్వాల జిల్లాలోని జూరాల ప్రాజెక్టు ఆరుగేట్లను బుధవారం ఎత్తి 34,320 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఎగువ నుంచి ప్రాజెక్టుకు 60వేల క్యూసెక్కుల వరద వచ్చిచేరుతోంది. ఎగువ, దిగువ విద్యుదుత్పత్తి కేంద్రాల్లో విద్యుత్‌కోసం 21,240 క్యూసెక్కుల నీటిని వినియోగిస్తున్నారు. జూరాల నుంచి మొత్తంగా 59,380 క్యూసెక్కులను శ్రీశైలానికి వదులుతున్నారు. దీంతో కృష్ణమ్మ పరుగులు తీస్తోంది.