సారథి న్యూస్, హుస్నాబాద్/ రామడుగు/గోదావరిఖని: అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని రాష్ట్రంలోని పలుచోట్ల ఘనంగా నిర్వహించారు. యోగాతో అనేక రుగ్మతలను దూరం చేసుకోవచ్చని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పేర్కొన్నారు. ప్రపంచ యోగ దినోత్సవం సందర్భంగా పెద్దపల్లి జిల్లా రామగుండంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఘనంగా యోగా దినోత్సవం నిర్వహించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో మున్సిపల్ వైస్ చైర్పర్సన్, యోగా టీచర్ అనితారెడ్డి యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. యోగాసనాలు వేస్తే ఎటువంటి వ్యాధులు దరిచేరవని […]
సారథి న్యూస్, రామడుగు: చైనా శత్రుమూకల దాడిలో అసువులు బాసిన వీర జవానులకు కరీంనగర్ జిల్లా రామడుగు విద్యావంతుల వేదిక ఆధ్వర్యంలో గురువారం ఘనంగా నివాళులు అర్పించారు. స్థానిక అంబేడ్కర్ విగ్రహం వద్ద కొవ్వొత్తులతో సంతాపం తెలిపారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. అమర జవానుల త్యాగాలను గుర్తుచేసుకున్నారు.