న్యూఢిల్లీ: ఇండియా – చైనా బోర్డర్ ఇష్యూను శాంతియుత చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని రెండు దేశాలు నిర్ణయించుకున్నాయని ఫారెన్ మినిస్ట్రీ ఆదివారం ప్రకటించింది. బోర్డర్ ఇష్యూపై రెండు దేశాల మిలటరీ ప్రతినిధులు శనివారం చర్చలు జరిపిన నేపథ్యంలో ఈ ప్రకటన చేసింది. ‘స్నేహపూర్వక, సానుకూల వాతావరణంలో భేటీ జరిగింది. ద్వైపాక్షిక ఒప్పందాలకు అనుగుణంగా బోర్డర్ ప్రాంతాల్లో పరిస్థితిని శాంతియుతంగా పరిష్కరించుకునేందుకు రెండు వర్గాలు అంగీకరించాయి. ద్వైపాక్షిక సంబంధాల అభివృద్ధికి రెండు దేశాల మధ్య శాంతి, ప్రశాంతత అవసరమని […]