సారథి న్యూస్, హైదరాబాద్: విత్తనాల కొరత, ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాలని మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. వానాకాలంలో విత్తనాల సరఫరాపై గురువారం రెడ్ హిల్స్ ఉద్యానశిక్షణ కేంద్రంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతులకు అవసరమైన విత్తనాలు అందుబాటులో ఉన్నాయని, క్లస్టర్ల వారీగా ఏయే విత్తనాలు కావాలో నమోదు చేయాలని అధికారులకు సూచించారు. ప్రధాన విత్తన కంపెనీల్లో ప్రతిరోజు సమాచారం సేకరించాలని ఆదేశించారు. సమావేశంలో వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి బి.జనార్ధన్ రెడ్డి, విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ […]