న్యూఢిల్లీ: సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లేయర్లు తనపై వర్ణవివక్ష వ్యాఖ్యలు చేశారని కొన్ని రోజులుగా ఆరోపణలు చేస్తున్న వెస్టిండీస్ మాజీ కెప్టెన్ డారెన్ స్యామీ వెనక్కి తగ్గాడు. తన సహచరులు ప్రేమతోనే ‘కాలూ’ అని పిలిచారని ఓ ట్వీట్‌తో తేల్చేశాడు. ఈ అంశాన్ని ఇంతటితో వదిలేస్తున్నట్లు ప్రకటించాడు. ‘నన్ను కాలూ అని పిలిచిన వ్యక్తితో మాట్లాడా. మా మధ్య ఆసక్తికరమైన సంభాషణ చోటు చేసుకుంది. మ్యాచ్‌ల బాగా ఆడినప్పుడు, ప్రేమ ఎక్కువైనప్పుడు అలా పిలుస్తారని చెప్పాడు. ఇందులో వర్ణవివక్ష […]
కింగ్స్టన్: ప్రపంచంలో కొనసాగుతున్న జాతి వివక్షపై అందరూ గళం విప్పాలని విండీస్ మాజీ కెప్టెన్ డారెన్ స్యామీ అన్నాడు. జాత్యహంకర ధోరణికి వ్యతిరేకంగా పోరాడాల్సిన సమయం ఆసన్నమైందన్నాడు. క్రికెట్ లోకం దీనిపై మాట్లాడాలని కోరాడు. ‘ఐసీసీతో పాటు అన్ని సభ్యదేశాలు దీనిపై మాట్లాడాలి. ఈ దురాగతాన్ని ఖండించాలి. లేదంటే ఈ వివక్షలో వీళ్లు కూడా భాగస్వాములేనని అనుకోవాల్సి వస్తుంది. ఇది కేవలం అమెరికాకే పరిమితం కాలేదు. ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న సామాజిక పిశాచి. దీనిని తరిమి కొట్టేదాకా […]
లండన్: కరోనా దెబ్బకు కుదేలైన క్రికెట్‌ను మళ్లీ గాడిలో పెట్టేందుకు అన్నిదేశాల బోర్డులు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాయి. వైరస్ బారినపడకుండా ఆటలో కొన్ని మార్పులను ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు(ఈసీబీ) ప్రతిపాదించింది. ఈ మేరకు ఐసీసీతో చర్చలు జరుపుతోంది. వెస్టిండీస్, పాకిస్థాన్‌తో జరగబోయే టెస్ట్ సిరీస్ ‘కరోనా సబ్ స్టిట్యూట్’ను ఇవ్వాలని ప్రతిపాదించింది. ప్రస్తుతం టెస్ట్‌ల్లో కంకూషన్ సబ్ స్టిట్యూట్ మాత్రమే ఉంది. ఇప్పుడు కరోనావ్యాప్తి నేపథ్యంలో ఎవరైనా ప్లేయర్ కు కొవిడ్ లక్షణాలు ఉంటే వాళ్ల స్థానంలో […]
జమైకా: తన సహచరుడు రామ్ నరేశ్ శర్వాణ్.. కరోనా వైరస్ కంటే భయంకరమైన వ్యక్తి అని విండీస్ డాషింగ్ బ్యాట్ మెన్ క్రిస్ గేల్ ఆరోపించాడు. కరీబియన్ ప్రీమియర్ లీగ్(సీపీఎల్) జట్టు జమైకా తలవాస్ నుంచి తనను తొలగించడం వెనక శర్వాణ్ పెద్ద కుట్రచేశాడని ధ్వజమెత్తాడు. గతేడాది గేల్ ను ఐకాన్ ప్లేయర్ గా తీసుకున్న జమైకా ఈసారి రిటైన్ చేసుకోలేదు. ఈసారి గేల్ సెయింట్ లూసియా జౌక్స్ టీముకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ‘తలావాస్ ఫ్రాంచైజీని శర్వాణ్ […]