సారథి న్యూస్, రామాయంపేట: వర్మీ కంపోస్టు ఎరువులతో గ్రామాలకు వనరులు సమకురుతాయని పీఆర్ డిప్యూటీ కమిషనర్ రామారావు అన్నారు. బుధవారం ఆయన మెదక్ జిల్లా రామాయంపేట మండల పరిధిలోని చల్మేడ గ్రామంలో డిస్ట్రిక్ పంచాయతీ ఆఫీసర్ హనోక్ తో కలసి పల్లె ప్రగతి పనులను పరిశీలించారు. తడి, పొడిచెత్తగా వేరు చేసి ఇవ్వాలని సూచించారు. ఆ చెత్తతో వర్మీ కంపోస్టు ఎరువు తయారుచేయాలన్నారు. అనంతరం నందగోకుల్ గ్రామంలో అవెన్యూ ప్లాంటేషన్ ను పరిశీలించారు.