సారథి న్యూస్, రామాయంపేట: వరి పంటలో అధిక దిగుబడులకు సరైన సస్యరక్షణ చర్యలు తీసుకోవాలని నిజాంపేట మండల వ్యవసాయాధికారి సతీష్రైతులకు సూచించారు. మంగళవారం ఆయన నిజాంపేట మండలంలోని నందిగామ గ్రామంలో పంట పొలాలను పరిశీలించారు. వరి పంటను మొగిపురుగు ఆశిస్తే మొదటగా 3జీ లేదా 4జీ గుళికలను ఎకరాకు ఆరు లేదా 8 కిలోల చొప్పున చల్లుకోవాలని సూచించారు. అగ్గితెగులు ఆశించినట్లయితే ట్రైసాక్లోజల్ 0.6 గ్రాములు లేదా 2.25 ఎం.ఎల్ కాసుమిసిన్ వేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఏఈవో […]