సారథి న్యూస్, మెదక్: వరలక్ష్మి వ్రతం సందర్భంగా శుక్రవారం మెదక్ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపాయల ఆలయంలో పూజారులు వనదుర్గామాత విగ్రహానికి అభిషేకం నిర్వహించారు. పుష్పాలంకరణ చేశారు. ప్రత్యేక కుంకుమార్చన నిర్వహించారు. భక్తులు దర్శించుకుని అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు.