Breaking News

వక్ఫ్ భూములు

వక్ఫ్ భూములను కాపాడండి

వక్ఫ్ భూములను కాపాడండి

సారథి, వేములవాడ: వేములవాడ మున్సిపాలిటీ పరిధిలోని తిప్పాపూర్ సర్వేనం.41,42,43 వక్ఫ్‌ బోర్డు భూముల్లో నిర్మిస్తున్న అక్రమకట్టడాలను కాపాడాలని పలువురు ముస్లింలు శనివారం సిరిసిల్ల ఆర్డీవో శ్రీనివాస్ కు కలిసి వినతిపత్రం అందజేశారు. తిప్పాపూర్ లో చాలా వరకు వక్ఫ్‌ బోర్డు భూములు అన్యాక్రాంతమై ఉన్నాయన్నారు. వాటికి రక్షణ కంచె వేసి కాపాడాలని కోరారు. స్పందించిన ఆర్డీవో మాట్లాడుతూ ప్రభుత్వపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ మేరకు వేములవాడ అర్బన్ తహసీల్దార్, మున్సిపల్ కమిషనర్ కు ఆదేశాలు జారీచేశారు.

Read More