– కరోనా నేపథ్యంలో బోసిపోయిన నల్లమల రోడ్లు– ప్రకృతి ఒడిలో సేదతీరుతున్న అడవి జంతువులు సారథి న్యూస్, నాగర్కర్నూల్: కరోనా ప్రతి ఒక్కరినీ ఇంటికే పరిమితం చేసింది. ఎక్కడ కాలు పెడితే మహమ్మారి అంటుకుంటుందోనని బిక్కుబిక్కుమంటూ రోజులు లెక్కిస్తున్నారు.. కానీ అటవీ జంతువులు మాత్రం స్వేచ్ఛగా విహరిస్తున్నాయి. శ్రీశైలం పేరు చెబితే.. ఠక్కున గుర్తుకొచ్చేది వన్యప్రాణుల నెలవుగా నిలిచిన నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ అభయారణ్యం.. నల్లమలలోని రోడ్డు వెంట ప్రయాణిస్తే అక్కడి ప్రకృతి అందాలు, పచ్చదనం […]