సారథి న్యూస్, బిజినేపల్లి: నాగర్కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం లట్టుపల్లి ప్రాథమిక వైద్యారోగ్య కేంద్రంలో శుక్రవారం ఆస్పత్రి అభివృద్ధి కమిటీ మీటింగ్ ఎంపీపీ శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. కరోనా వ్యాధి నివారణకు ఇక్కడి వైద్యారోగ్య కేంద్రంలో మంచి వైద్యసేవలు అందుతున్నాయని సంతోషం వ్యక్తంచేశారు. ఆస్పత్రిలో ప్రసవాలు చేయించుకునేలా ప్రోత్సహించాలని కోరారు. చిన్నపిల్లల వైద్యుల సేవలను వినియోగించుకోవాలని కోరారు. జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ సాయినాథ్, స్థానిక డాక్టర్ రాజేష్ గౌడ్ ఆస్పత్రిలోని సమస్యలను నేరుగా చూపించారు. […]
సారథి న్యూస్, బిజినేపల్లి: నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలంలోని లట్టుపల్లి పంచాయతీ ఉప సర్పంచ్సంతకాన్ని అదే గ్రామ సర్పంచ్ వెంకటయ్య కొడుకు ఫోర్జరీ చేసి రూ.1.44లక్షలు డ్రా చేశాడని ఆరోపిస్తూ.. గ్రామస్తులు, వార్డుసభ్యులు సోమవారం జిల్లా అడిషనల్ కలెక్టర్ మనుచౌదరికి ఫిర్యాదు చేశారు. గ్రామంలో చేయని పనులకు రికార్డులు సృష్టించి సర్పంచ్ కుమారుడే చెక్కులపై సంతకాలు చేసుకుని ఎస్ టీవో ఆఫీసులో బిల్లులు డ్రా చేశాడని తెలిపారు. నిందితులపై చర్యలు తీసుకోవాలని కోరారు.