Breaking News

లక్నో

రావత్ ఎక్కడున్నా అభివృద్ధిని చూస్తారు

ఎక్కడున్నా అభివృద్ధిని చూస్తారు

ప్రధాని నరేంద్రమోడీ ప్రతిష్టాత్మక సరయూ ప్రాజెక్టు ప్రారంభం లక్నో: స్వర్గీయ సీడీఎస్​చీఫ్​జనరల్‌ బిపిన్‌ రావత్‌ ఎక్కడ ఉన్నా రాబోయే రోజుల్లో భారత్‌ ముందుకెళ్తున్న తీరు, అభివృద్ధిని గమనిస్తూ ఉంటారని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. రావత్‌ మరణం ప్రతి దేశభక్తుడికి నష్టమే అన్నారు. ఆయన అత్యంత ధైర్యసాహాసాలు కలిగిన వ్యక్తి అని, దేశసైన్యాన్ని స్వయంవృద్ధి చేసేందుకు ఎంతో కృషిచేశారని కొనియాడారు. ఆయన పనితీరును దేశం ప్రత్యక్షంగా చూసిందని పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్‌లోని బలరాంపూర్‌లో ప్రతిష్టాత్మకమైన సరయూ నహర్‌ నేషనల్‌ ప్రాజెక్టును […]

Read More

మధ్యప్రదేశ్​ గవర్నర్​ కన్నుమూత

లక్నో: మధ్యప్రదేశ్ గవర్నర్ లాల్​జీ టాండన్​ (85) మంగళవారం తెల్లవారుజామున కన్నుమూశారు. ఈ మేరకు ఆయన కుమారుడు అశుతోష్​ ట్వీట్​చేశారు. ఆయన కొంతకాలంగా జ్వరం, మూత్రపిండాల సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. నెల క్రితం లక్నోలోని ఓ ఆస్పత్రిలో చేరారు. టాండన్​ మాజీ ప్రధాని వాజపేయికి సన్నిహితుడు. ఉత్తర్​ప్రదేశ్​ మంత్రిగా కొంతకాలం పనిచేశారు. చిన్నప్పటినుంచే టాండన్​ ఆరెస్సెస్​లో క్రియాశీలకంగా ఉండేవారు. తర్వాత జనసంఘ్​లో చేరారు. టాండన్​ మృతికి ప్రధాని మోదీ, కేంద్రమత్రి స్మృతి ఇరానీ సంతాపం తెలిపారు.

Read More
వికాస్‌ దుబేపై రివార్డు పెంపు

వికాస్‌ దుబేపై రివార్డు పెంపు

లక్నో: ఉత్తర్‌‌ప్రదేశ్‌లో 8 మంది పోలీసులను కాల్చి చంపిన ఘటనలో ప్రధాన నిందితుడు వికాస్‌ దుబేపై పోలీసులు రివార్డు పెంచారు. ఇప్పటి వరకు రూ.50 వేలు ఉన్న రివార్డును 2.5లక్షలకు పెంచుతూ యూపీ డైరెక్టర్‌‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌ హెచ్‌ సీ. అవస్థి ఆదేశాలు జారీచేశారని అడిషనల్‌ డైరెక్టర్‌‌ జనరల్‌ ఆఫ్‌ లా అండ్‌ ఆర్డర్‌‌ ప్రశాంత్‌ కుమార్‌‌ సోమవారం చెప్పారు. నిందితుడిపై ముందు రూ.50వేలు ఉన్న రివార్డును రూ.లక్షకు పెంచారు. ఆ తర్వాత ఇప్పుడు రూ.2.5లక్షలకు […]

Read More
వికాస్‌ దుబేను పట్టుకునేందుకు స్పెషల్‌ టీమ్స్‌

వికాస్‌ దుబేను పట్టుకునేందుకు స్పెషల్‌ టీమ్స్‌

లక్నో: 8 మంది పోలీసుల చావుకు కారణమైన మోస్ట్​ వాంటెడ్​ క్రిమినల్‌ వికాస్‌ దుబేను అరెస్టు చేసేందుకు పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. అతడ్ని పట్టుకునేందుకు 25 స్పెషల్‌ టీమ్స్‌ను ఏర్పాటు చేసినట్లు అధికారులు చెప్పారు. ‘వికాస్‌ దుబే, అతని అనుచరులను పట్టుకునేందుకు 25 స్పెషల్‌ టీమ్స్‌ను ఏర్పాటుచేశాం. దీని కోసం వివిధ జిల్లాల్లో రైడ్స్‌ చేస్తున్నాం. రాష్ట్రం, పక్క రాష్ట్రాల్లో కూడా అతని కోసం గాలిస్తున్నాం’ అని కాన్పూర్‌ ఇన్​స్పెక్టర్​ జనరల్​ ఆఫ్​ పోలీస్‌ […]

Read More