సారథి, రాయికల్: కరోనా మహమ్మారి వణికిస్తోంది. టెస్టులు చేస్తే పదుల సంఖ్యలో కొవిడ్కేసులు నమోదవుతున్నాయి. కరీంనగర్జిల్లా రాయికల్ పట్టణంలోని జడ్పీ బాలుర హైస్కూల్ ఆవరణలో నిర్వహించిన టెస్టింగ్ కేంద్రంలో 100 మందికి గురువారం కరోనా ర్యాపిడ్ నిర్ధారణ పరీక్షలు చేయగా 28 మందికి పాజిటివ్ గా వచ్చినట్లు వైద్యాధికారి డాక్టర్ కృష్ణచైతన్య తెలిపారు. అందులో రాయికల్ పట్టణానికి చెందిన 11 మంది, మహితాపూర్ కు చెందిన నలుగురు, కట్కాపూర్ వాసులు ఇద్దరు, అయోధ్య కు చెందిన ఇద్దరు, […]