సామాజిక సారథి, హైదరాబాద్: ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి, తమిళనాడు మాజీ గవర్నర్, రాజకీయ భీష్ముడిగా పేరొందిన కొణిజేటి రోశయ్య(88) శనివారం ఉదయం కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఇవాళ పల్స్ పడిపోవడంతో ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో తుదిశ్వాస విడిచారు. ఆయనకు సతీమణి శివలక్ష్మి, ముగ్గురు సతానం ఉన్నారు. ఉమ్మడి ఏపీ రాష్ట్ర రాజకీయాల్లో ఉద్దండులైన నేతగా పేరొందారు. వయస్సు రీత్యా రాజకీయాలకు కొంతకాలంగా దూరంగా ఉంటున్నారు. మలి దశ తెలంగాణ ఉద్యమ సమయంలో సంచలన […]