సారథి న్యూస్, చొప్పదండి: సీఎం కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన రైతు బీమా పథకం ఓ కుటుంబాన్ని ఆదుకున్నది. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం ర్యాలపల్లి గ్రామానికి చెందినపిట్టల రాజు, మనీషా తండ్రి గతములో చనిపోయాడు. తల్లి విజయ కూడా ఇటీవల మరణించింది. దీంతో పిల్లలిద్దరూ అనాథలుగా మారారు. కాగా, తల్లి విజయ పేరు మీద భూమి ఉండడంతో రైతుబీమా కింద రూ. ఐదు లక్షలు వారి పిల్లలకు మంజూరయ్యాయి. చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్రాజు,మనీషాకు చెక్కును మంగళవారం […]