కలకత్తా: బంతిపై ఉమ్మిని రుద్దకుండా నిషేధం విధించినా.. తాను మాత్రం రివర్స్ స్వింగ్ రాబడతానని టీమిండియా పేసర్ మహ్మద్ షమీ అన్నాడు. కాకపోతే బంతి రంగు మారకుండా జాగ్రత్తగా కాపాడుకోవాలని సూచించాడు. ‘ఇందులో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. చిన్నతనం నుంచి పేసర్లు బంతిపై ఉమ్మి రుద్దేందుకు అలవాటుపడ్డారు. ఇది ఆటలో భాగమైపోయింది. ఒకవేళ నీవు ఫాస్ట్ బౌలర్ కావాలనుకుంటే బంతి రంగు మెరుగపర్చేందుకు ఉమ్మిని రుద్దాల్సిందే. అయితే ఆ బంతి రంగు పోకుండా కాపాడగలిగితే కచ్చితంగా రివర్స్ […]
న్యూఢిల్లీ: బంతి రంగును మెరుగుపర్చేందుకు ఉమ్మిని నిషేధించడంపై టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా భిన్నంగా స్పందించాడు. ఉమ్మి కాకపోతే మరో ప్రత్యామ్నాయం చూపాలని కోరాడు. బంతిని మెరుగుపర్చకపోతే బౌలర్లకు తీవ్ర ఇబ్బందులు తప్పవని హెచ్చరించాడు. ‘వికెట్ తీసిన తర్వాత కౌలిగింతలు, షేక్ హ్యాండ్స్ వద్దంటున్నారు. వ్యక్తిగతంగా నాకూ ఇవి ఇష్టం ఉండదు. కానీ ఉమ్మి విషయంలోనే అసలు సమస్య. ఉమ్మిని ఉపయోగించకుండా బంతిని ఎలా మెరుగుపర్చాలి. దీనికోసం మరో దానిని చూపించాల్సిందే. ఎందుకంటే బంతిని కాపాడుకోకపోతే […]