సామాజిక సారథి, సంగారెడ్డి: దివ్యాంగులు ఆత్మస్థైర్యంతో సమాజంలో సకలాంగులతో సమానంగా జీవించేలా ముందుకు సాగాలని అదనపు కలెక్టర్ రాజార్షిషా అన్నారు. గురువారం జిల్లా కలెక్టరేట్ ఆడిటోరియంలో జిల్లా మహిళ ,శిశు, వికలాంగుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. సమాజంలో ఉన్నత స్థాయిలో జీవించడానికి వికలాంగులకు అంగవైకల్యం అడ్డుకారాదని, పట్టుదలతో కృషి చేస్తే లక్ష్యాలను సాధిస్తారన్నారు. దివ్యాంగుల పట్ల ప్రభుత్వం ప్రత్యేక […]