Breaking News

రాజరాజేశ్వరస్వామి

రాజన్నకు టీఎస్​పీఎస్సీ సభ్యుడి పూజలు

రాజన్నకు టీఎస్​పీఎస్సీ సభ్యుడి పూజలు

సారథి, వేములవాడ: దక్షిణకాశీగా పేరొందిన వేములవాడ రాజరాజేశ్వర స్వామి వారిని గురువారం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీఎస్​పీఎస్సీ) సభ్యుడు కారం రవీందర్​రెడ్డి, కరీంనగర్ టీఎన్జీవో ప్రెసిడెంట్ మారం జగదీశ్​ దర్శించుకుని ప్రత్యేకపూజలు చేశారు. అనంతరం కోడెమొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ అర్చకులు నాగిరెడ్డి మండపంలో సాదరంగా ఆహ్వానం పలికి వేదోక్తంగా ఆశీర్వచనాలు అందించారు. పీఆర్వో ఉపాధ్యాయుల చంద్రశేఖర్ రావు శాలువాతో సత్కారించి సన్మానించారు. వారి వెంట రాజన్న సిరిసిల్ల జిల్లా టీఎన్జీవో ప్రెసిడెంట్ తో పాటు ఏఈవో […]

Read More
రాజన్న హుండీ గలగల

రాజన్న హుండీ గలగల

సారథి, వేములవాడ: సిరిసిల్ల రాజన్న జిల్లా వేములవాడ వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయ హుండీని గురువారం లెక్కించారు. ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 6గంటలకు కౌంటింగ్​చేశారు. ఆలయానికి రూ.1.2 కోట్ల ఆదాయం సమకూరింది. 198 గ్రాముల బంగారం, 11 కిలోలన్నర వెండి వచ్చింది. ఈ లెక్కింపు ప్రక్రియ ఆలయ కార్యనిర్వహణాధికారి హరికిషన్ ఆధ్వర్యంలో కొనసాగింది.

Read More
రాజన్న సన్నిధిలో బీజేపీ నేషనల్ ఎస్సీ మోర్చా ప్రెసిడెంట్

రాజన్న సన్నిధిలో బీజేపీ నేషనల్ ఎస్సీ మోర్చా ప్రెసిడెంట్

సారథి, వేములవాడ: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో ప్రసిద్ధి చెందిన వేములవాడ రాజరాజేశ్వర స్వామి వారిని శుక్రవారం బీజేపీ జాతీయ ఎస్సీ మోర్చా ప్రెసిడెంట్ లాల్ సింగ్ ఆర్యా ఉదయం దర్శించుకున్నారు. అనంతరం నాగిరెడ్డి మండపంలో అర్చకులతో వేదోక్తంగా ఆశీర్వచనం తీసుకున్నారు. వారికి ఆలయ పీఆర్వో ఉపాధ్యాయుల చంద్రశేఖర్ లడ్డూప్రసాదం అందజేసి స్వామి వారి చిత్రపటాన్ని బహూకరించారు. ఆయన వెంట మంత్రి శ్రీనివాస్ తో పాటు రాజన్న సిరిసిల్ల బీజేపీ జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ, రాష్ట్ర […]

Read More
రాజన్న సన్నిధిలో మత్యశాఖ కమిషనర్

రాజన్న సన్నిధిలో మత్స్యశాఖ కమిషనర్

సారథి, వేములవాడ: దక్షిణకాశీ ఆలయంగా పేరొందిన వేములవాడ రాజరాజేశ్వర స్వామి వారిని కుటుంబసమేతంగా రాష్ట్ర మత్స్యశాఖ కమిషనర్ లచ్చిరామ్ భూక్య దర్శించుకున్నారు. వారికి ఆలయ అర్చకులు సాదర స్వాగతం పలికారు. శాలువా కప్పి సత్కరించారు. అభిషేకం అనంతరం లడ్డూ ప్రసాదం అందజేశారు.

Read More
ఆరోగ్య తెలంగాణ.. సీఎం సంకల్పం

ఆరోగ్య తెలంగాణ.. సీఎం సంకల్పం

డయేరియా ప్రబలకుండా చర్యలు తీసుకోవాలి మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి సారథి, రామాయంపేట: మొక్కలను పెంచి హరిత తెలంగాణను నిర్మించి ఆరోగ్యవంతమైన రాష్ట్రంగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో సీఎం కేసీఆర్​ ఎంతో కృషిచేస్తున్నారని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి కొనియాడారు. పల్లెప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమం నిరంతర ప్రక్రియ అయినప్పటికీ ఈ 10రోజులు స్పెషల్ డ్రైవ్ చేస్తున్నామని తెలిపారు. ఆదివారం ఆమె నిజాంపేట మండల కేంద్రంలో పల్లెప్రగతిలో కార్యక్రమంలో భాగంగా మొక్కను నాటి నీళ్లుపోశారు. ఈ సందర్భంగా ఆమె […]

Read More
రాజన్నకు తీరొక్క మొక్కులు

రాజన్నకు తీరొక్క మొక్కులు

సారథి, వేములవాడ: శాతవాహన అర్బన్ డెవలప్​మెంట్​ చైర్మన్ జీవీ రాంకిషన్ ఆదివారం కుటుంబసమేతంగా దక్షిణకాశీగా పేరొందిన వేములవాడ రాజరాజేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. కోడె మొక్కులు చెల్లించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అర్చకులు ఆత్మీయ స్వాగతం పలికారు. శాలువాతో సన్మానించి లడ్డూ ప్రసాదం అందజేశారు. కార్యక్రమంలో ఆలయ అర్చకులు, అధికారులు పాల్గొన్నారు.

Read More
ఆలయ ఉద్యోగ సంఘం అధ్యక్షుడిగా చంద్రశేఖర్

ఆలయ ఉద్యోగ సంఘం అధ్యక్షుడిగా చంద్రశేఖర్

సారథి, వేములవాడ: వేములవాడ పార్వతీ సమేత రాజరాజేశ్వరస్వామి ఆలయ ఉద్యోగ సంఘం అధ్యక్షుడిగా ఉపాధ్యాయుల చంద్రశేఖర్ బుధవారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆలయ ధర్మకర్తల మండలి సమావేశ మందిరంలో ఉద్యోగులు తమ కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. గౌరవాధ్యక్షుడిగా సిరిగిరి శ్రీరాములు, గౌరవ సలహాదారులుగా సంకేపల్లి హరికిషన్ , ప్రధాన కార్యదర్శిగా పేరుక శ్రీనివాస్, ట్రెజరర్ గా ఒన్నారం భాస్కర్, సంయుక్త కార్యదర్శిగా నక్క తిరుపతి, ఉపాధ్యక్షుడిగా వరి నరసయ్య, వెంకటలక్ష్మి, కార్యవర్గసభ్యులుగా అరుణ్ కుమార్, నునుగొండ రాజేందర్, గుండి నరసింహమూర్తి, […]

Read More
నాంపల్లి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో నృసింహ జయంతి

నాంపల్లి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో నృసింహ జయంతి

సారథి, వేములవాడ: వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి దత్తత దేవస్థానంగా ఉన్న నాంపల్లిగుట్టపై వెలసిన లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో దివ్య కల్యాణ మహోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి అభిషేకం, నిత్యహోమం, సహస్రనామార్చన, వేదవిన్నపాలు నిర్వహించారు. తీర్థప్రసాద వితరణ చేశారు. కార్యక్రమంలో అర్చకస్వాములు రమణాచారి, విజయసింహచారితో పాటు పర్యవేక్షకులు అల్లి శంకర్, ఇన్ చార్జ్ నూగురి నరేందర్ పాల్గొన్నారు.

Read More