Breaking News

యోగాదినోత్సవం

యోగాతో రోగనిరోధకశక్తి

న్యూఢిల్లీ : యోగాతో రోగనిరోధక శక్తి పెరుగుతుందని.. తద్వారా మహమ్మారి కరోనాను ఎదుర్కోవచ్చని ప్రధాని నరేంద్రమోదీ పేర్కొన్నారు. యోగాతో శ్వాస ఇబ్బందులు తొలిగిపోతాయని చెప్పారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ ఆన్​లైన్​లో జాతినుద్దేశించి ప్రసంగించారు. యోగాతో మానసిక, శారీరక ఆరోగ్యం మెరుగవుతుందని చెప్పారు. భారతదేశానికి మనపూర్వీకులు అందించిన గొప్పవరం యోగా అని పేర్కొన్నారు. నేడు ప్రపంచమంతా యోగాను అనుసరిస్తున్నదని చెప్పారు. ఇంట్లోనే ఉంటూ కుటుంబసభ్యులతో కలిసి యోగాను చేయాలని సూచించారు.

Read More