సారథి న్యూస్, జడ్చర్ల: కర్వెన రిజర్వాయర్ ఓపెనింగ్ కు ఊర్కొండ మండలం జగబోయిన్పల్లి సర్పంచ్ పిలుపు మేరకు ర్యాలీకి వెళ్లి ట్రాక్టర్ బోల్తాపడి మృతి చెందిన ఎర్రోళ్ల రాజు కుటుంబానికి ఆదుకోవాలని జై భీమ్ యూత్ ఇండియా రాష్ట్ర అధ్యక్షుడు జంతుక శంకర్ డిమాండ్ చేశారు. ప్రమాద జరిగిన స్థలంలో టీఆర్ఎస్ నాయకులు కనీసం పట్టించుకోలేదన్నారు. ఏడునెలల క్రితమే రాజుకు వివాహమైందని, తన భార్య ఏడునెలల గర్భిణిగా ఉందన్నారు. ఈ ఘటనకు జడ్చర్ల ఎమ్మెల్యే నైతిక బాధ్యత […]