నేటి రాశిఫలాలు8 మే 2021శనివారం మేషం: దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. ఆర్థికంగా బాగా అభివృద్ధి చెందుతారు. స్త్రీలకు పనిభారం అధికమవుతుంది. ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తినిస్తాయి. ఇంటాబయట ఒత్తిళ్లు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగాల్లో అదనపు పనిభారం వలన విశ్రాంతి లభించదు. వ్యాపారాలు ఆశించిన రీతిలో రాణించవు. నిరుద్యోగులకు నిరాశ తప్పదు. విద్యార్థులకు పోటీపరీక్షల్లో మిశ్రమ ఫలితాలు అందుతాయి. ఏదైనా అమ్మకానికి చేయు ప్రయత్నాలు వాయిదావేయడం మంచిది కోర్టు వ్యవహారాలు వాయిదాపడుట మంచిది. వృషభం: కుటుంబసమస్యలు పరిష్కారమవుతాయి. […]