సారథి న్యూస్, హైదరాబాద్: మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కీసర అటవీ ప్రాంతంలో కలెక్టర్ వి.వెంకటేశ్వర్లు, అటవీశాఖ సిబ్బందితో కలిసి మంగళవారం పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. హరితహారంలో భాగంగా గతేడాది మాస్ ప్లాంటేషన్ లో ఎంపీ సంతోష్ కుమార్ నాటిన మొక్కలు బాగున్నాయని అభిప్రాయపడ్డారు. ఖాళీగా ఉన్న ప్రదేశాల్లో వర్షాకాలంలో మొక్కలు నాటాలని అధికారులను ఆదేశించారు. ఎకో పార్క్ పార్కులో వాకింగ్ ట్రాక్, చిల్డ్రన్స్ పార్క్ ఏర్పాటు చేయాలన్నారు. కీసరలోని చెరువును సుందరీకరించి పర్యాటక […]