సారథి, వేములవాడ: వేములవాడ రూరల్ మండల మూలవాగు పరీవాహక ప్రాంతలైన మల్లారం, జయవరం గ్రామాల నుంచి అక్రమంగా ఇసుక తరలింపును రైతులు అడ్డుకున్నారు. ఇసుకను తరలిస్తే భూగర్భజలాలు అడుగంటిపోయి బావులు ఎండిపోయి ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ బావుల్లో నీళ్లు ఉంటేనే వ్యవసాయం సాగదని రైతులు అన్నారు. అక్రమ రవాణా నిలిపివేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ ఆందోళనలో ఇరుగ్రామాలకు చెందిన రైతులు వెంగళరావు రవి, మల్లేశం, బాబురావు, అశోక్, వేణు, శ్రీనివాస్, నర్సయ్య, […]