సారథి న్యూస్, వాజేడు: వానాకాలంలో నిల్వ ఉన్న నీటితో అంటువ్యాధులు ప్రబలకుండా ఉండేందుకు శుక్రవారం ములుగు జిల్లా వాజేడు మండలం మూరుమూరు పంచాయతీలో ఫ్రై డే.. డ్రై డే కార్యక్రమం నిర్వహించారు. నిల్వ ఉన్న నీటిని తొలగించారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. సర్పంచ్ పూసం నరేష్, హెల్త్ పర్యవేక్షకుడు కోటిరెడ్డి, శేఖర్, కన్యాకుమారి, ఛాయాదేవి, లలిత కుమారి, అంగన్వాడీ టీచర్, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.