సారథి న్యూస్, కర్నూలు: కర్నూలు జిల్లా దేవరగట్టులో కర్రల సమరానికి బ్రేక్ పడింది. ఈ ఏడాది దసరా రోజున జరగాల్సిన బన్నీ ఉత్సవంపై నిషేధం విధించారు. కరోనా నేపథ్యంలో ఈ ఉత్సవంపై నిషేధం విధించినట్లు పోలీసులు ప్రకటించారు. గీత దాటితే చర్యలు తప్పవని హెచ్చరించారు. దసరా వచ్చిందంటే ఎక్కడైనా దుర్గమ్మ పూజలు చేస్తారు. కానీ కర్నూలు జిల్లా దేవరగట్టులో కర్రలతో ఫైట్ చేస్తుంటారు. సంప్రదాయం పేరిట తలలు పగలగొట్టుకుంటారు. చేతులు విరగ్గొట్టుకుంటారు. కర్రల యుద్ధంలో ఎంతో మంది […]