సారథి న్యూస్, హుస్నాబాద్: మృతుడి కుటుంబానికి వాట్సాప్ గ్రూపు సభ్యులు మేమున్నామని చేయూతనిచ్చారు. ఈ సందర్భంగా గ్రూప్ అడ్మిన్ దామెర మల్లేశం మాట్లాడుతూ.. సిద్దిపేట జిల్లా మద్దూర్ మండల కేంద్రంలోని నిరుపేద కుటుంబానికి చెందిన బొందుగుల వెంకటయ్య ఇటీవల అనారోగ్యంతో మృతిచెందాడు. సోషల్ మీడియాలో ఒక్కటైన గ్రూప్ సభ్యులు తలకొంత డబ్బులు వేసుకుని 50కిలోల బియ్యాన్ని అందజేశారు. కార్యక్రమంలో వాట్సాప్ గ్రూప్ అడ్మిన్ మల్లేశం, గ్రూప్ సభ్యులు, యువకులు పాల్గొన్నారు.
సారథి న్యూస్, నారాయణపేట: మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్ రైతన్నలా మారారు. అరక పట్టి పొలం దున్నారు. కొద్దిసేపు రైతులతో మాట్లాడి వారి కష్టసుఖాలు తెలుసుకున్నారు. నారాయణపేట జిల్లా మద్దూర్ మండలం నిడ్జింత జడ్పీ హైస్కూలులో నూతనంగా నిర్మించిన అదనపు గదులను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలిసి గురువారం ప్రారంభించారు. తిరుగు ప్రయాణంలో పొలంలో విత్తనాలు వేస్తున్న రైతులను కలిసి వారి బాగోగులు తెలుసుకున్నారు. విత్తనాలు అందుతున్నాయా.. లేదా.. అని అడిగి ఆరా తీశారు. మంత్రి తమతో […]