సారథి న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం: నేరస్తులు ఎవరైనా సరే శిక్షపడేలా కృషిచేయాలని భద్రాద్రి కొత్తగూడెం ఎస్పీ సునీల్దత్పోలీసు అధికారులను ఆదేశించారు. శనివారం తన ఆఫీసులో మణుగూరు సర్కిల్, కొత్తగూడెం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ అధికారులతో సమావేశం నిర్వహించారు. పెండింగ్కేసుల వివరాలను ఆరాతీశారు. పెండింగ్లో ఉన్న కేసుల పరిష్కారానికి ప్రతిఒక్కరూ బాధ్యతాయుతంగా కృషిచేయాలని ఆదేశించారు. న్యాయాధికారులతో సమన్వయం పాటించాలన్నారు. సమావేశంలో మణుగూరు ఏఎస్పీ శబరీష్, ఏసీబీ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు, డీసీఆర్బీ సీఐ గురుస్వామి, మణుగూరు సీఐ షుకూర్, […]
సారథిన్యూస్, కొత్తగూడెం: తెలంగాణ రాష్ట్రంలోకి మావోయిస్టులు ఎంటరయ్యారా? భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగురు అటవీప్రాంతంలో మూడు మావోయిస్టు బృందాలు తిరుగుతున్నాయా? అంటే అవుననే సమాధానం వినవస్తుంది. మణుగురు అటవీప్రాంతంలో మావోయిస్టులు తిరుగుతున్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. దీంతో మణుగురు అటవీ ప్రాంతాన్ని 20 ప్రత్యేకబృందాలు జల్లెడ పడుతున్నాయి. ఈ ప్రాంతంలోని వ్యక్తులపై ఏ మాత్రం అనుమానం వచ్చినా అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్టు సమాచారం. సుమారు 400 మంది పోలీసులు మావోయిస్టుల కదలికలపై ముమ్మరంగా గాలిస్తున్నారు.