సారథి న్యూస్, హైదరాబాద్: సుమారు రూ.3.65 కోట్ల వ్యయంతో సుందరీకరణ పనులు చేపట్టిన హైదరాబాద్‌లోని జిల్లెలగూడ చందనం చెరువును శుక్రవారం విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రజలకు అంకితం చేశారు. చెరువు చుట్టూ వాకింగ్ ట్రాక్, ఫెన్సింగ్, బతుకమ్మ ఘాట్, ప్లాంటింగ్, ఐలాండ్, పక్షులు, జంతువుల బొమ్మలతో చేపట్టిన పనులు స్థానికులను ఆకట్టుకుంటున్నాయి. కాంక్రీట్ జంగిల్‌గా మారుతున్న పట్టణ ప్రాంతాల్లో ప్రజలు సేదతీరడానికి చెరువు పరిసరాలు, పార్కులు దోహదపడతాయని, గొలుసుకట్టు చెరువులను దశలవారీగా అభివృద్ధి చేస్తామని మంత్రి […]
సారథి న్యూస్, హైదరాబాద్: రాష్ట్ర హైకోర్టు తీర్పును అనుసరించి రాష్ట్రంలో జరిగే 10వ తరగతి పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి శనివారం సాయంత్రం ప్రకటించారు. ఎగ్జామ్స్ విషయంలో అనుసరించాల్సిన వ్యూహంపై సీఎం కేసీఆర్ వద్ద సమావేశం నిర్వహించి తదుపరి నిర్ణయాన్ని ప్రభుత్వం ప్రకటిస్తుందని ఆమె స్పష్టంచేశారు. అయితే అంతకుముందు తెలంగాణలో పదో తరగతి పరీక్షల నిర్వహణకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. గ్రేటర్ హైదరాబాద్, రంగారెడ్డి మినహా రాష్ట్ర వ్యాప్తంగా టెన్త్ పరీక్షలు […]