ప్రశ్నించే గొంతును నొక్కేస్తే ఊరుకునేదే లేదు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి సామాజిక సారథి, సిద్దిపేట: గ్రీన్ ట్రిబ్యునల్ పరిహారం ఇచ్చిన తర్వాతే రిజర్వాయర్ పనులు చేపట్టాలని ఆదేశించినా అవేవి పట్టనట్లు ప్రభుత్వం వ్యవహస్తుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి అన్నారు. సోమవారం సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం గౌరవెల్లి భూనిర్వాసితులు చేస్తున్న దీక్షకు మద్దతు తెలిపి మాట్లాడారు. భూనిర్వాసితులు దశాబ్దంన్నర కాలంగా పరిహారం కోసం రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా, ప్రభుత్వం, అధికారులు […]