సారథి, నిజాంపేట: మెదక్ జిల్లా నిజాంపేట మండల కేంద్రంలో సోమవారం ఫర్టిలైజర్ దుకాణాల యజమానులతో భాస్వరం కరగదీసే బ్యాక్టీరియాపై మండల వ్యవసాయాధికారి సతీష్ అవగాహన నిర్వహించారు. రైతులు వేసిన భాస్వరం ఎరువు 40శాతం మాత్రమే మొక్కలు తీసుకుని మిగతా 60శాతం భూమిలో బంధించి ఉంటుందన్నారు. ఈ భాస్వరాన్ని ఈ బ్యాక్టీరియా ద్వారా అందుబాటులోనికి తీసుకురావచ్చన్నారు. అదేవిధంగా రైతులు భాస్వరం వాడకం తగ్గించాలని సూచించారు. పీఎస్ బీ స్టా్క్ రైతులకు అందుబాటులో ఉండేలా చూడాలని డీలర్లకు సూచించారు. కార్యక్రమంలో […]