సారథి న్యూస్, మానవపాడు(జోగుళాంబ గద్వాల): జిల్లాలోని అలంపూర్నియోజకవర్గంలో శుక్రవారం రాత్రి నుంచి కురిసిన భారీవర్షాలకు వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. నాలుగు రోజులుగా ఇదే పరిస్థితి నెలకొంది. అంతర్రాష్ట్ర రహదారి రాయిచూర్ మార్గంలో వాగు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో ప్రయాణికులు వెళ్లలేక 40 నుంచి 60 కి.మీ. దూరం మేర గద్వాల మీదుగా ప్రయాణిస్తున్నారు. అలాగే మానవపాడు మండల కేంద్రంలో అమరవాయి వాగు ఉప్పొంగడంతో ఏడు గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. మండలంలోని పత్తి పంటలు నీట మునిగాయి. మానవపాడు […]