మెక్సికో సిటీ : భారీ భూకంపంతో మెక్సికో నగరం వణికిపోయింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 7.7 గా నమోదైందని యూఎస్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. దక్షిణ మెక్సికోలోని పలు ప్రాంతాల్లో భూ ప్రకంపనలు చోటుచేసుకున్నట్టుగా తెలిపింది. స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 10.29 గంటలకు ఈ భూకంపం సంభవించింది. ఆక్సాకా స్టేట్ పసిఫిక్ తీరంలో భూకంప కేంద్రం కేంద్రీకృతం అయినట్టుగా సమాచారం. భూకంప ప్రభావంతో మెక్సికోలో పలు భవనాలు కంపించాయి. ఒక్కసారిగా భూమి కంపించడంతో ప్రజలు […]