Breaking News

భద్రాద్రి కొత్తగూడెం

ప్రతి గింజను ప్రభుత్వమే కొంటుంది

ప్రతి గింజను ప్రభుత్వమే కొంటుంది

సారథి న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం: రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వమే కొంటుందని మాజీ మంత్రి, కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు అన్నారు. శుక్రవారం ఆయన సుజాతనగర్ లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు వనమా రాఘవేంద్రరావు, జిల్లా జడ్పీ వైస్ చైర్మన్ కంచర్ల చంద్రశేఖర్ రావు, కొత్తగూడెం సొసైటీ చైర్మన్ మండే వీరహనుమంతరావు, ఎంపీపీ శ్రీమతి విజయలక్ష్మి, సొసైటీ వైస్ చైర్మన్ జగన్, ఎంపీటీసీ శోభారాణి పాల్గొన్నారు.

Read More
వారెవ్వా.. కాపీయింగ్​!

వారెవ్వా.. కాపీయింగ్​

సారథి న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం: ఓపెన్ ​యూనివర్సిటీ ఎగ్జామ్స్ ​నిర్వహణ అభాసుపాలవుతోంది. నిర్వాహకులు బుక్స్, సెలఫోన్స్ ​ముందుపెట్టుకుని ఎగ్జామ్స్ ​రాయించడం చర్చనీయాంశంగా మారింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని రవి ఐటీఐ కాలేజీలో నాగార్జున యూనివర్సిటీ ఓపెన్ డిస్టెన్స్ ఎగ్జామ్స్ నిర్వహిస్తున్నారు. ఇక్కడ జోరుగా మాస్ కాపీయింగ్ కొనసాగుతోంది. కోవిడ్ ​19 నిబంధనలు పాటించకుండా ఒకే రూమ్ లో 40 మందిని కిక్కిరిసి కూర్చోబెట్టి పరీక్ష రాయిస్తున్నారు. నిర్వాహకులు విద్యార్థుల వద్ద ఒక్కో సబ్జెక్ట్ కు కొంత […]

Read More
నేరస్తులకు శిక్షపడేలా కృషి

నేరస్తులకు శిక్షపడేలా కృషి

సారథి న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం: నేరస్తులు ఎవరైనా సరే శిక్షపడేలా కృషిచేయాలని భద్రాద్రి కొత్తగూడెం ఎస్పీ సునీల్​దత్​పోలీసు అధికారులను ఆదేశించారు. శనివారం తన ఆఫీసులో మణుగూరు సర్కిల్, కొత్తగూడెం వన్​ టౌన్ పోలీస్ స్టేషన్ అధికారులతో సమావేశం నిర్వహించారు. పెండింగ్​కేసుల వివరాలను ఆరాతీశారు. పెండింగ్​లో ఉన్న కేసుల పరిష్కారానికి ప్రతిఒక్కరూ బాధ్యతాయుతంగా కృషిచేయాలని ఆదేశించారు. న్యాయాధికారులతో సమన్వయం పాటించాలన్నారు. సమావేశంలో మణుగూరు ఏఎస్పీ శబరీష్, ఏసీబీ ఇన్​స్పెక్టర్​ శ్రీనివాసరావు, డీసీఆర్బీ సీఐ గురుస్వామి, మణుగూరు సీఐ షుకూర్, […]

Read More

ఊరూరా హరితపండుగ

సారథిన్యూస్​, భద్రాద్రి కొత్తగూడెం​: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమం ఊరూరా జోరుగా సాగుతున్నది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని సారపాక ఫారెస్ట్ రేంజ్ కు చెందిన 30 ఎకరాల్లో మంత్రి పువ్వాడ అజయ్​, ఎంపీ మాలోతు కవిత, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, విప్​ రేగా కాంతారావు తదితరులు మొక్కలు నాటారు. కొత్తగూడెంలోని పోలీస్​ హెడ్​ కార్టర్స్​లో ఎస్పీ సునీల్​ దత్​ హరితహారంలో పాల్గొన్నారు. బూర్గంపాడులోని సారపాక పుష్కర వనం వద్ద మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ […]

Read More

ఇక తెలంగాణ సస్యశ్యామలం

సారథి న్యూస్​, భద్రాద్రి కొత్తగూడెం: ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనకు తమ ప్రాణాలను సైతం అర్పించిన అమరవీరుల త్యాగాలను స్మరించుకోవలని కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పాల్వంచలో మంగళవారం పలు కార్యక్రమాలు నిర్వహించారు. ముఖ్య​అతిథిగా పాల్గొన్న ఆయన అమరవీరులకు నివాళులర్పించారు. సీఎం కేసీఆర్​ నాయకత్వంలో తెలంగాణ సస్యశ్యామలం అవుతుందన్నారు. కార్యక్రమంలో టీఆర్​ఎస్​ జిల్లా నాయకులు వనమా రాఘవేంద్రరావు, డీసీఎంఎస్​ అధ్యక్షుడు కొత్వాల శ్రీనివాసరావు, జడ్పీ వైస్ చైర్మన్ కంచర్ల […]

Read More

మావోయిస్టు కమిటీ సభ్యుల సరెండర్​

సారథి న్యూస్​, కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని చర్ల మండలం కుర్నపల్లి గ్రామానికి చెందిన ఆరుగురు నిషేధిత మావోయిస్ట్ పార్టీ కమిటీ సభ్యులను ఆదివారం గ్రామస్తులు స్వచ్ఛందంగా పోలీసుల ఎదుట సరెండర్ చేయించారు. వారిలో కోరం నాగేశ్వర్రావు, కొమరం రమేష్ , సొందే రమేష్, కోరం సత్యం, ఇర్పా వెంకటేశ్వర్లు, వాగే కన్నారావు ఉన్నారు. ఇకపై మావోయిస్టులకు సహకరించేది లేదని గ్రామస్తులంతా స్వచ్ఛందంగా తీర్మానం చేశారు.

Read More