బొగ్గు గనుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిరసన సింగరేణి ఏరియా అఖిలపక్ష కార్మిక సంఘాల పిలుపు సామాజిక సారథి, భద్రాద్రికొత్తగూడెం: బొగ్గు గనుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈనెల 9,10,11 తేదీల్లో జరిగే సమ్మెలో పాల్గొనాలని సింగరేణి కార్మికులకు ఏరియా అఖిలపక్ష కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి. టీబీజీకేఎస్ నేత కోటా శ్రీనివాస్ అధ్యక్షతన ఓసీ2లో జరిగిన ఫిట్ సమావేశం శనివారం జరిగింది. ఈ సందర్భంగా టీబీజీకేఎస్ బ్రాంచి ఉపాధ్యక్షుడు వి.ప్రభాకర్‌రావు, ఏఐటీయూసీ నేత రామ్‌గోపాల్, ఐఎన్‌టీయూసీ నాయకుడు వెలగపల్లి జాన్, […]
సారథి న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం: ప్రతి కేసులో నిష్పక్షపాతంగా వ్యవహరిస్తూ సమగ్ర విచారణ చేపట్టాలని భద్రాద్రి కొత్తగూడెం ఎస్పీ సునీల్‌దత్ జిల్లా పోలీసు అధికారులకు సూచించారు. శుక్రవారం జిల్లా ఎస్పీ ఆఫీసులో పాల్వంచ, కొత్తగూడెం సబ్ డివిజన్ పోలీస్ ఆఫీసర్లతో నేరాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసుల వివరాలను ఆన్లైన్లో నిక్షిప్తం చేయాలని సూచించారు. సమగ్ర విచారణ జరిపి నేరస్తులకు శిక్షపడేలా చూడాలన్నారు. ఆన్లైన్ ద్వారా అర్జీలు తీసుకునేలా అధికారులకు అవగాహన […]
సారథిన్యూస్, కొత్తగూడెం: తెలంగాణ రాష్ట్రంలోకి మావోయిస్టులు ఎంటరయ్యారా? భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగురు అటవీప్రాంతంలో మూడు మావోయిస్టు బృందాలు తిరుగుతున్నాయా? అంటే అవుననే సమాధానం వినవస్తుంది. మణుగురు అటవీప్రాంతంలో మావోయిస్టులు తిరుగుతున్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. దీంతో మణుగురు అటవీ ప్రాంతాన్ని 20 ప్రత్యేకబృందాలు జల్లెడ పడుతున్నాయి. ఈ ప్రాంతంలోని వ్యక్తులపై ఏ మాత్రం అనుమానం వచ్చినా అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్టు సమాచారం. సుమారు 400 మంది పోలీసులు మావోయిస్టుల కదలికలపై ముమ్మరంగా గాలిస్తున్నారు.