సారథి, ములుగు: ములుగు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో కాంగ్రెస్ ఆలిండియా మహిళా ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్యే సీతక్క ఎన్ టీవీ, భక్తిటీవీ, వనిత టీవీ పంచాంగం బుక్ ఆవిష్కరించారు. భక్తిటీవీ మున్ముందు మరింత ప్రేక్షకాదరణ పొందాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో వరంగల్ స్టాఫ్ రిపోర్టర్ అరుణ్ కుమార్, ములుగు రిపోర్టర్ సంపత్, ములుగు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నల్లాల కుమారస్వామి. కాంగ్రెస్ జిల్లా యూత్ అధ్యక్షుడు బానోత్ చందర్, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.