న్యూఢిల్లీ: జాతి వివక్షకు వ్యతిరేకంగా పోరాడేందుకు విండీస్ క్రికెట్ జట్టు కూడా సమాయత్తమైంది. ఈ మేరకు ఇంగ్లండ్‌తో జరిగే మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో ‘బ్లాక్ లైవ్ మ్యాటర్స్’ లోగోతో బరిలోకి దిగనుంది. దీనికి ఐసీసీ కూడా ఆమోదం తెలిపింది. విండీస్ క్రికెటర్లు ధరించే జెర్సీల కాలర్‌పై దీనిని ప్రత్యేకంగా ముద్రించనున్నారు. ప్రముఖ డిజైనర్ అలీషా హోసన్నా ఈ లోగోను రూపొందించింది. ఇప్పటికే ప్రీమియర్ లీగ్‌కు చెందిన 20 ఫుట్‌బాల్ క్లబ్స్ ఈ లోగోను ధరించి జాతి […]