సామాజిక సారథి, తల్లాడ: రోడ్డు మరమ్మతుల్లో భాగంగా ప్రమాద నివారణ చర్యలు లోపించి ఖమ్మం జిల్లా తల్లాడ మండలం అంబేద్కర్ నగర్ వద్ద ఆదివారం తెల్లవారుజామున ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో నలుగురు ప్రయాణికులు గాయపడ్డారు. ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా పోలవరం నుంచి శనివారం రాత్రి మియాపూర్ కు బయల్దేరిన కొత్తగూడెం డిపోకు చెందిన సూపర్ లగ్జరీ బస్సు మార్గమధ్యలో తల్లాడ మండలం అంబేద్కర్ నగర్ వద్ద గుంతలు […]