సామాజిక సారథి, చొప్పదండి: ధర్మారం మండలం దొంగతుర్తి ఉన్నత పాఠశాలలో గురువారం ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. బాసర ఐఐఐటీలో సీటు సాధించిన ఇద్దరు విద్యార్థుల్లో ఒకరైన విద్యార్థిని కొప్పుల అంజలికి ప్రముఖ ఎన్ఆర్ఐ, ఆస్ట్రేలియాలో ఉంటున్న భీమనాతిని రాజశేఖర్ అందించి రూ.10వేల నగదు సాయాన్ని హెచ్ఎం ఎన్.అనురాధ, ఎస్ఎంసీ చైర్మన్జూంజిపెల్లి రాజయ్య అందజేశారు. విద్యార్థులను సర్పంచ్ పాలకుర్తి సత్తయ్య, ఉపసర్పంచ్ ముత్యాల చంద్రశేఖర్, ఎంపీటీసీ సభ్యుడు దాడి సదయ్య, ఉపాధ్యాయ బృందం అభినందించారు.