సారథి న్యూస్, కర్నూలు: కర్నూలు నగరాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హామీ ఇచ్చారని ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ తెలిపారు. మంగళవారం విజయవాడలో ఆయన ముఖ్యమంత్రిని కలిశారు. అనంతరం విలేకరులకు వివరాలు వెల్లడించారు. నగరంలో చేపట్టాల్సిన పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి ముఖ్యమంత్రికి వివరించినట్లు తెలిపారు. అందుకు ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారని పేర్కొన్నారు. ముఖ్యంగా తాగునీటి సమస్య రాకుండా శాశ్వత చర్యలు తీసుకోవాలని కోరినట్లు తెలిపారు. నీటి సమస్య తలెత్తకుండా రెండవ సమ్మర్ స్టోరేజీ […]