సారథి, బిజినేపల్లి: నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి(డీఎంహెచ్ వో) డాక్టర్ కె.సుధాకర్ లాల్ సోమవారం తనిఖీచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బిజినేపల్లి పీఎచ్ సీ పరిధిలో ప్రతి ఇంటిని సందర్శించి వారి ఆరోగ్యపరిస్థితులు తెలుసుకోవాలని సూచించారు. జ్వరం, జలుబు, దగ్గు, ఒళ్లునొప్పులు, గొంతు నొప్పి తదితర లక్షణాలు ఉన్న ఏ ఒక్కరినీ వదలకుండా నమోదుచేసుకుని, వారికి హోం ఐసొలేషన్ కిట్ ఇవ్వాలని సూచించారు. కరోనా […]
సారథి, సిద్దిపేట ప్రతినిధి: నియోజకవర్గ కేంద్రమైన హుస్నాబాద్ పట్టణంలోని నాలుగో వార్డు పరిధిలోని బాలాజీనగర్, కాకతీయ నగర్ లో ఇంటింటా ఫీవర్ సర్వే నిర్వహించారు. అలాగే కరోనా వ్యాధి పీడితుల యోగక్షేమాలను సిబ్బంది అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ ఐలేని అనితారెడ్డి, ఆర్ పీ శోభ, ఆశావర్కర్ కాంత పాల్గొన్నారు.