సారథి న్యూస్, నాగర్ కర్నూల్: దగ్గు, జ్వరం, జలుబు లక్షణాలకు మెడికల్ షాపుల్లో మందులు కొనేవారిపై దృష్టిపెట్టాలని నాగర్ కర్నూల్ కలెక్టర్ ఈ.శ్రీధర్ సూచించారు. ఈ లక్షణాలతో ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారి వివరాలు సేకరించాలని ఆదేశించారు. బుధవారం ఆయన కలెక్టర్ క్యాంపు ఆఫీసులో డాక్టర్లతో సమీక్షించారు. ఫీవర్ టెస్ట్ లను పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు. జిల్లాలో ఇద్దరు కరోనా పాజిటివ్ వ్యక్తులను జిల్లా ఆస్పత్రి నుంచి ఇంటికి పంపించినట్లు తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్ మనుచౌదరి, […]