సారథిన్యూస్, హైదరాబాద్: గాంధీ ఆస్పత్రిలోని ఓ వార్డుకు ఇటీవల కరోనాతో ప్రాణాలు కోల్పోయిన జర్నలిస్ట్ మనోజ్ కుమార్ పేరు పెట్టారు. కరోనా భారినపడ్డ జర్నలిస్టులకు ఇకపై ప్రత్యేకవార్డులో చికిత్సనందించనున్నట్టు గాంధీ వైద్యులు తెలిపారు. గాంధీ దవాఖానలోని ఆరో అంతస్తులో మనోజ్పేరుతో ఓ వార్డు ఏర్పాటు చేసినట్టు దవాఖాన వర్గాలు తెలిపాయి. కాగా రాష్ట్రంలో ఇప్పటికే 16 మంది జర్నలిస్ట్‌లకు కరోనా సోకగా, మనోజ్ చనిపోయారు. ఈ నేపథ్యంలో మీడియా ప్రతినిధుల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. స్పందించిన ప్రభుత్వం […]