సారథి న్యూస్, వనపర్తి: వనపర్తి జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్ కాలేజీ ఆవరణలో టీజేఏసీ ఆధ్వర్యంలో సురవరం ప్రతాపరెడ్డి 134వ జయంతి వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. ప్రజా వాగ్గేయకారుడు రాజారామ్ ప్రకాష్ మాట్లాడుతూ.. సురవరం ప్రతాపరెడ్డి గోల్కొండ పత్రిక సంపాదకుడి, పరిశోధకుడిగా బహుముఖ ప్రజ్ఞాశాలి అని కొనియాడారు. తెలంగాణకు ఆయన వరం లాంటి వారని అన్నారు. నిజాం పాలనపై గర్జించిన యోధుడని కొనియాడారు. కార్యక్రమంలో కవిపండితుడు గిరిరాజాచారి, వనపర్తి జిల్లా ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ కమిటీ సభ్యులు […]