సారథి, హుజూరాబాద్: మాజీ మంత్రి ఈటల రాజేందర్ క్యాంప్ ఆఫీసులో ఆయనకు వ్యతిరేకంగా ముద్రించిన కరపత్రాలు కలకలం సృష్టించాయి. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ ఎమ్మెల్యే ఆఫీస్ వద్ద ప్రజాఆరోగ్య పరిరక్షణ సంఘం పేరిట గుర్తు తెలియని వ్యక్తులు కరపత్రాలు వేసి వెళ్లిపోయారు. ఈటల అక్రమాస్తులపై సీబీఐ విచారణతో పాటు అతని బినామీలైన రంజిత్ రెడ్డి, వెంకట్రాంరెడ్డి ఇళ్లపై ఐటీదాడులు చేయాలని అందులో పేర్కొన్నారు. ఆయన ఎన్నికల్లో పోటీచేసినప్పుడు ఇచ్చిన ఆస్తుల అఫిడవిట్లను పరిశీలించి తప్పుడు లెక్కలు చూపినందుకు […]