సారథి న్యూస్, వాజేడు, ములుగు: యాంత్రిక జీవన విధానంలో అలసిపోతున్న ప్రజలకు మానసిక ఉల్లాసాన్ని పొందేందుకు పల్లె ప్రకృతివనాలు ఎంతో దోహదపడతాయని ములుగు జిల్లా కలెక్టర్ ఎస్.క్రిష్ణఆదిత్య అన్నారు. సోమవారం ములుగు జిల్లా కేంద్రంలోని తంగేడు మైదానంలో నిర్మించిన పల్లె ప్రకృతివనాన్ని కలెక్టర్, ములుగు ఎమ్మెల్యే ధనసరి అనసూయ(సీతక్క)తో కలిసి ప్రారంభించారు. అన్ని పంచాయతీల్లో పల్లె ప్రకృతి వనాల నిర్మాణాలు తుదిదశకు చేరాయని వివరించారు. సేదదీరడానికి ఏర్పాటుచేసిన బెంచిలో కలెక్టర్, ఎమ్మెల్యేతో పాటు ప్రజాప్రతినిధులు కాసేపు కూర్చుని […]