సారథి న్యూస్, మెదక్: కరోనా సమయంలో వైద్యసిబ్బంది ఫ్రంట్ లైన్ లో ఉండి జిల్లా ప్రజలకు వైద్యసేవలు అందించడంలో శాయశక్తులా కృషిచేసి మరణాలను నివారించగలిగారని జిల్లా ఇన్చార్జ్కలెక్టర్పి.వెంకట్రామరెడ్డి ప్రశంసించారు. ఇదే స్ఫూర్తితో త్వరలో రాబోయే కోవిడ్ వ్యాక్సిన్ ను ప్రాధాన్యతా క్రమంలో ఇచ్చేందుకు ముందస్తు ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. శనివారం కలెక్టరేట్ లోని వైద్యాధికారుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎలాంటి విపత్తునైనా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషిచేసిందన్నారు. కరోనా వ్యాక్సిన్ను తొలిదశలో కోవిడ్ ఫ్రంట్ లైన్ వారియర్స్ […]